Maryam Sharif : పాక్ ఆర్మీని వేడుకున్న ఇమ్రాన్ ఖాన్

మ‌రియం న‌వాజ్ సంచ‌ల‌న ఆరోప‌ణ

Maryam Sharif : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ కూతురు మ‌రియ‌మ్ న‌వాజ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె మ‌రోసారి మాజీ ప్ర‌ధాన మంత్రి , మాజీ పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగారు.

అవిశ్వాస తీర్మానం వీగి పోవ‌డంతో త‌న ప‌ద‌విని కోల్పోయారు. ఈ సంద‌ర్భంగా త‌ను దిగిపోయేందుకు విదేశీ శ‌క్తులు ప‌ని చేశాయ‌ని, దీని వెనుక అమెరికా ఉందంటూ ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా మొద‌టి నుంచీ ఇమ్రాన్ ఖాన్ దిగి పోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతూ వ‌స్తోంది మ‌రియం న‌వాజ్. న‌వాజ్ ష‌రీఫ్ త‌మ్ముడే ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరిన షెహ‌బాజ్ ష‌రీఫ్‌.

ఇదిలా ఉండ‌గా త‌న ప‌ద‌వి ఉండేందుకు ఇమ్రాన్ ఖాన్ చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేశాడ‌ని మండిప‌డ్డారు. ఆఖ‌రు వ‌ర‌కు ఆర్మీని కాపాడమంటూ వేడుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌రియ‌మ్ ష‌రీఫ్‌.

ఈనెల 10 న ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. ఖాన్ వేడుకున్నా ఆర్మీ క‌నిక‌రించ లేద‌ని పేర్కొన్నారు పాకిస్తాన్ ముస్లిం లీగ్ న‌వాజ్ ఉపాధ్య‌క్షురాలు మ‌రియం న‌వాజ్.

ఇదిలా ఉండ‌గా త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చింది నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ టీం. ఈ మేర‌కు ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు హై సెక్యూరిటీ క‌ల్పించాల‌ని ఆదేశించారు.

సుప్రీంకోర్టు క‌లుగ చేసుకుని ఆదేశించేంత వ‌ర‌కు ఎన‌లేని ప్ర‌య‌త్నాలు చేశార‌ని మండిప‌డ్డారు. కానీ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ను ఒప్పు కోలేద‌న్నారు.

Also Read : పాక్ దాడుల‌పై యుఎన్ కు ఆఫ్గాన్ ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!