Antony Blinken : ర‌ష్యా భార‌త్ మైత్రిపై బ్లింకెన్ కామెంట్

యుఎస్ స‌పోర్ట్ లేక పోవ‌డం వ‌ల్ల‌నే ఇదంతా 

Antony Blinken  : అమెరికా విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken )సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అమెరికా భార‌త్ కు స‌రైన స‌మ‌యంలో భ‌రోసా ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ర‌ష్యాతో మైత్రి కొన‌సాగిస్తూ వ‌స్తుంద‌న్నారు.

ఇందులో ఎందుకు అభ్యంత‌రం తెలియ చేయాలని ప్ర‌శ్నించారు. మ‌నం భాగ‌స్వామిగా ఉండే స్థితిలో లేన‌ప్పుడు త‌ను ఎవ‌రితో ఫ్రెండ్ షిప్ చేయాల‌న్న‌ది భార‌త్ నిర్ణ‌యించు కుంటుంద‌న్నారు.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఒక ర‌కంగా మ‌న వైపు త‌ప్పు పెట్టుకుని భార‌త్ ను నిందించ‌డం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు బ్లింకెన్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఒక వేళ ర‌ష్యా, చైనా, ఇండియా గ‌నుక ఒక్క‌టి అవుతే అది అమెరికాకు తీర‌ని న‌ష్టం. ప్ర‌ధానంగా అమెరికాలో అత్య‌ధికంగా కీల‌క పోస్టుల్లో , కీల‌క కంపెనీల్లో ప్ర‌వాస భార‌తీయులే ఉన్నారు.

ప్ర‌త్యేకించి జోసెఫ్ బైడెన్ కార్యాల‌యంలో 70 శాతానికి పైగా ఇండియ‌న్లే హ‌వా చెలాయిస్తున్నారు. అయితే అమెరికా, భార‌త్ ల మ‌ధ్య ప్ర‌స్తుతం వ్యూహాత్మ‌క క‌ల‌యిక పెరుగుతోంద‌ని వెల్ల‌డించారు ఆంటోనీ బ్లెంకెన్(Antony Blinken ).

అంత‌కు ముందు అమెరికా స‌పోర్ట్ లేక పోవ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌న్నారు. దీంతో మాస్కోతో ఢిల్లీ త‌న భాగ‌స్వామ్యాన్ని అత్యవ‌స‌రంగా నిర్మించుకుంద‌ని వెల్ల‌డించారు బ్లింకెన్.

ఇరు దేశాలు ఒకే వేదిక‌పైకి రావాల‌ని కోరుకుంటున్నాయి. దేశాలు అన్నాక కొన్ని ఇబ్బందులు ఉండ‌డం స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు బ్లింకెన్.

దీర్ఘ‌కాలికంగా భార‌త్ తో మ‌నుకున్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం 21వ శ‌తాబ్దంలో మ‌రింత మేలు చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు బ్లింకెన్ చెప్పారు.

Also Read : పాక్ ఆర్మీని వేడుకున్న ఇమ్రాన్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!