PM Modi : దేశ ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పెట్రోల్ పై పన్ను తగ్గించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు ఆయా రాష్ట్రాల సీఎంలు. ప్రధానంగా సీఎంలు కేసీఆర్, స్టాలిన్ , తదితరులు నిప్పులు చెరిగారు.
ధరల నియంత్రణ చేపట్టాల్సిన పీఎం నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడేందుకు సిగ్గుండాలి అని పేర్కొనడం సంచలనం కలిగించింది. ఇదిలా ఉండగా మోదీ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ( విలువ ఆధారిత పన్ను) తగ్గించాలని కోరారు.
ఉత్తరాఖండ్ లో పెట్రోల్ లీటర్ రూ. 104 గా ఉందని అదే మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ ధర రూ. 122 గా ఉందన్నారు. మిగతా రాష్ట్రాలు ఉత్తరాఖాండ్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు.
దీనిపై బీజేపీయేతర రాష్ట్రాలు భగ్గుమన్నాయి పీఎం నరేంద్ర మోదీపై(PM Modi). పన్నులు తగ్గించడం లేదంటూ తమపై అభాండాలు మోపడం భావ్యం కాదన్నారు. విపక్షాలతో పాటు సీఎంలు సైతం నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా వ్యాట్ తగ్గించాలని తాను మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , తెలంగాణ, ఏపీ, కేరళ, జార్ఖండ్ , తమిళనాడు రాష్ట్రాలను కోరానని కానీ తగ్గించ లేదన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కోరేందుకు పీఎంకు సిగ్గుండాలి అని అన్నారు. 2015 నుంచి తమ రాష్ట్రంలో ఇంధన పన్నులు పెంచలేదని చెప్పారు.
రాష్ట్రాలను అడిగే బదులు కేంద్రం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. తాము ఇప్పటికే రూ. 1500 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రం కావాలనే రాష్ట్రాలను టార్గెట్ చేస్తోందన్నారు మరాఠా సీఎం ఠాక్రే.
Also Read : మరాఠాలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ – మోదీ