Mayawati : తనపై అనవసర ఆరోపణలు చేసిన సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై నిప్పులు చెరిగారు బీఎస్పీ చీఫ్ మాయావతి(Mayawati). ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మాయావతి గంప గుత్తగా తన కేడర్ ను భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసిందని ఆరోపించారు.
ఆమె రాష్ట్రపతి కూడా కావచ్చేమో అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించారు మాయావతి. తాను మరోసారి యూపీకి సీఎం అవుతానని, వీలైతే దేశానికి ప్రధాన మంత్రి కావాలని కోరిక ఉందన్నారు.
కానీ తనకు రాష్ట్రపతి కావాలని కోరుకోవడం లేదన్నారు. బహుజనులు, అణగారిన వర్గాలు ఎల్లప్పుడూ బీఎస్పీ వైపు ఉంటాయన్నారు. ఎవరికి భయపడి మాయావతి తన ఓటు బ్యాంకు ను బదలాయించిందో చెప్పాలన్నారు.
విచిత్రం ఏమిటంటే బీఎస్పీకి ఒకే ఒక్క సీటు లభించింది. ఇక కాంగ్రెస్ కు 2 సీట్లు మాత్రమే వచ్చాయి. సమాజ్ వాది పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకుంది. ఈ సందర్భంగా మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే సీఎం, ప్రధాని అయ్యే అవకాశం సులభం అవుతుందన్నారు మాయావతి. సీఎం కావాలని ఉంది. ప్రధాని కావాలని కూడా కోరికుందన్నారు.
రాష్ట్రపతి కావాలన్న కాంక్ష తనలో లేదన్నారు. తాను ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. అంబేద్కర్ ,కాన్షీరాం బాటలో నడుస్తానని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్ మాయావతి(Mayawati).
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
Also Read : ప్రధాని మోదీపై సీఎంలు ఫైర్