TS Govt Jobs : రాష్ట్రంలోని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకటి వెంట మరొకటి నోటిఫికేషన్ విడుదల అవుతోంది. మొన్నటికి మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(TS Govt Jobs )ఇచ్చింది.
గ్రూప్ -1 పోస్టుల ఎంపికకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TS Govt Jobs )పచ్చ జెండా ఊపింది. తాజాగా ఎక్సైజ్ , రవాణా శాఖలో ఖాళీగా 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ 6 పోస్టులు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ (ఎల్సీ) 57 పోస్టులు , ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 614 కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ దాకా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇదిలా ఉండగా ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ కాకుండా టీఎస్ఎల్ఆర్పీ నింపుతుంది. దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 16 వేల 614 పోలీస్ కొలువులకు పచ్చ జెండా ఊపింది.
ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. ఇందులో 16 వేల కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు.
ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వాటిలో డిప్యూటీ కలెక్టర్ 42, డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ 91, సీటీఓ 48, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -1 పోస్టులు 41, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 58, ఏఏఓ 40, ఎంపిడీఓ 121 పోస్టులు ఉన్నాయి.
నిరుద్యోగులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు జాబ్స్ కోసం.
Also Read : ఘనంగా ఓయూ ఆవిర్భావ దినోత్సవం