Prashant Kishor : దేశ వ్యాప్తంగా మరోసారి చర్చల్లో నిలిచారు భారత దేశ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస లో చేరుతున్నానని వస్తున్న ప్రచారం ఒట్టిదేనని మరోసారి కుండబద్దలు కొట్టారు.
అయితే ఆయన సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీకి తనకు మధ్య అవగాహన కుదిరిందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ చానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా పై విధంగా కామెంట్స్ చేయడం కలకలం రేపింది రాజకీయ వర్గాల్లో. కాంగ్రెస్ పార్టీకి తన లాంటి వారి అవసరం లేదని స్పష్టం చేశారు.
సొంతంగానే ఆ పార్టీ తిరిగి నిలబడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమేం ప్లాన్లు అమలు చేయాలనే దానిపై ఒక ఒప్పందానికి వచ్చామన్నారు.
ఆ పార్టీలో సమర్థవంతమైన నాయకులు, నాయకత్వం ఉందన్నారు పీకే. అయితే తనను కాంగ్రెస్ పార్టీలో చేరమని అడిగారని కానీ తాను అందుకు ఒప్పు కోలేదని చెప్పారు.
తాను కింగ్ కావడం కంటే కింగ్ మేకర్ గా ఉండడమే ఇష్టమని మరోసారి స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). 2014 నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీ ఎలా దిగజారిందో, ఆ గ్యాప్ ను ఎలా పూడ్చు కోవాలో కూడా సూచించానని తెలిపారు.
ఈ విషయాన్ని ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి వివరించానని పీకే వెల్లడించారు. సోనియా ఏర్పాటు చేసిన సాధికారత కమిటీలో చేరమన్నారని, కానీ అందులో కొన్ని సందేమాలు ఉన్నాయని తెలిపారు.
Also Read : కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్టే – బొమ్మై