UN Chief : యుద్దం మార‌ణ‌హోమం బాధాక‌రం

యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్ర‌స్

UN Chief : యుద్దం ఎవ‌రి కోసం. దేనిని సాధిద్దామ‌ని చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికి ప‌లుమార్లు చెబుతూనే వ‌చ్చాం. కానీ వినిపించుకోలేదు. ఇవాళ ఇక్క‌డ చూస్తున్న ప్ర‌తి దృశ్యం క‌ళ్ల‌ను చెమ‌ర్చేలా చేస్తోంది.

నా కుటుంబం కోల్పోయినంత బాధ‌గా ఉంది. ఇది ముమ్మాటికీ క్ష‌మించ‌రానిది. ప్ర‌తి ఒక్క‌రు త‌ల దించు కోవాల్సిన ప‌రిస్థితి. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు సాక్షాత్తు ఐక్య రాజ్య స‌మితి (UN Chief)ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్.

ఆయ‌న ర‌ష్యా ఏక‌ప‌క్షంగా దాడుల‌కు తెగ బ‌డుతూ మార‌ణ హోమం సృష్టిస్తున్న ఉక్రెయిన్ బాధిత ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. ఆయ‌న శ‌క‌లాల‌ను చూసి చ‌లించి పోయారు.

రాజ‌ధాని కీవ్ , ప‌రిస‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. బోరొడియాంకా న‌గ‌రాన్ని చూసిన ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ర‌ష్యా మూకుమ్మ‌డిగా జ‌రిపిన దాడులు, బాంబింగ్ వ‌ల్ల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లింది.

అక్క‌డ చోటు చేసుకున్న హృద‌య విదార‌క‌మైన ప‌రిస్థితుల్ని చూసి త‌ట్టుకోలేక పోయారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ ధ్వంస‌మైన భ‌వంతులు ఉన్నాయి.

వీటిని చూస్తూ ఉంటే గుండె త‌రుక్కు పోతోంది. ఎంత మంది ఇందులో చిక్కుకు పోయారో తెలియ‌డం లేదు. నా ఫ్యామిలీ పూర్తిగా ధ్వంస‌మైన‌ట్లు అనిపిస్తోంది.

నా మ‌నుమ‌రాళ్లు భ‌యంతో ప‌రుగులు తీస్తున్న‌ట్లు అనిపించింద‌న్నారు. 21వ నాగ‌రిక‌పు శ‌తాబ్దంలో యుద్దం ఓ మూర్ఖ‌త్వ‌పు చ‌ర్య‌గా (UN Chief)ఆయ‌న అభివ‌ర్ణించారు.

బాధితుల‌కు నివాళి అర్పిస్తున్నాన‌ని తెలిపారు. యుద్దాన్ని ఆమోదించ బోమ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు.

Also Read : పాక్ దాడుల‌పై యుఎన్ కు ఆఫ్గాన్ ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!