RR vs MI : ఐపీఎల్ 2022లో టైటిల్ ఫెవరేట్ గా ఉన్న రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్(RR vs MI ) ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. మొత్తం ఈ జట్టు ఎనిమిది లీగ్ మ్యాచ్ లు ఆడింది.
ఒక్కటి కూడా నమోదు చేయలేదు. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్(RR vs MI ) మొత్తం 8 మ్యాచ్ లు ఆడింది 6 మ్యాచ్ లలో విజయం సాధించి రెండింట్లో ఓటమి పాలైంది.
ప్లే ఆఫ్స్ కు చేరే ఆశలు సన్నగిల్లాయి. దీంతో కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా విజయం సాధించి పోయిన పరువు కాపాడు కోవాలని చూస్తోంది
ముంబై. ఇక రాజస్థాన్ రాయల్స్ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను సమిష్టిగా రాణిస్తోంది.
ఒకరు ఆడక పోయినా మరొకరు ఆడుతూ సత్తా చాటుతున్నారు. రాత్రి జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది చూడాలి.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ కెప్టెన్. జోస్ బట్లర్ , రాస్సీ వాన్ డస్సెస్ , దృవ్ జురెల్,
జేమ్స్ నీషమ్ , శుభమ్ గర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయర్ , దేవదత్ పడిక్కల్ , యజువేంద్ర చహల్ ఆడనున్నారు.
వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథన్ కౌల్టర్ నైల్ , రవిచంద్రన్ అశ్విన్ , ప్రసీద్ కృష్ణ, తేజాస్ బరోకా, ఓబెద్ మెకాయ్,
రియాన్ పరాగ్, డారిల్ మిచెల్ , అనునయ్ సింగ్ , యశస్వి జైస్వాల్ , నవదీప్ సైనీ, కరుణ్ నాయర్, కేసి కరియప్ప, కుల్దీప్ యాదవ్ ఆడతారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా , రమణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,
అర్షద్ ఖాన్, సూర్య కుమార్ యాదవ్ ,కీరన్ పొలార్డ్ , ఇషాన్ కిషన్ , జస్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడతారు. వీరితో పాటు ఆర్యన్ జుయల్ ,
అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్కర్ , జోఫ్రా ఆర్చర్ , డానియెల్ సామ్స్ , టైమల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,
సంజయ్ యాదవ్ , తిలక్ వర్మ, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్ , మయాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడతారు.
Also Read : కృనాల్ పాండ్యా మెస్మరైజ్