Jos Butler : ఐపీఎల్ 2022 లో ఒకే ఒక్కడి గురించే చర్చంతా జరుగుతోంది. అతడు ఎవరో కాదు ప్రపంచ క్రికెట్ లో అత్యంత విధ్వంసకరమైన ఆటగాడిగా పేరొందారు ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్.
రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీలో 500 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ వన్ లో నిలిచాడు బట్లర్.
ఇందులో హాప్ సెంచరీలు, మూడు బ్రిలియంట్ సెంచరీలు సాధించాడు. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్రధానంగా జోరు మీదున్న బట్లర్ (Jos Butler )పైనే ఫోకస్ పెట్టింది.
2018లో మెగా వేలంలో జోస్ బట్లర్ ను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేజిక్కించుకుంది. ఈ లీగ్ లో ఎక్కువ స్కోర్ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 95 రన్స్ చేసి సత్తా చాటాడు.
2019 దాకా బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ తరపున ఆడాడు బట్లర్. తన సహచర ఆటగాడు జో రూట్ తో కలిసి ఆడాడు. ఈ లీగ్ లో బట్లర్ 273 రన్స్ చేశాడు.
2019లో మరోసారి మెగా ఐపీఎల్ వేలం పాటలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేజిక్కించుకుంది. అశ్విన్ మాన్ కడింగ్ ద్వారా రనౌట్ అయ్యాడు.
2020లో ఇంకోసారి బట్లర్ ను కైవసం చేసుకుంది ఆర్ఆర్. ఈ లీగ్ లో 328 రన్స్ చేశాడు. కంటిన్యూగా 2021లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 ఐపీఎల్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు జోస్ బట్లర్.
Also Read : బెంగళూరు వర్సెస్ గుజరాత్ బిగ్ ఫైట్