Police Case : పంజాబ్ పోలీసుల‌పై ఢిల్లీ పోలీస్ కేసు

జ‌ర్న‌లిస్ట్ పై దాడి చేసిన ఘ‌ట‌న‌

Police Case : ఇది విచిత్ర‌మైన ఘ‌ట‌న‌. రెండు రాష్ట్రాల‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వాలే కొలువు తీరాయి. కానీ చిన్న‌పాటి ఘ‌ట‌న ఒక‌రిపై మ‌రొక‌రు కేసు న‌మోదు చేసేంత దాకా వెళ్లింది.

ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌ధాన కార‌ణం ఢిల్లీకి చెందిన జ‌ర్న‌లిస్టులపై పంజాబ్ ఖాకీల నిర్వాకం. దీంతో సీరియ‌స్ గా తీసుకుంది ఢిల్లీ స‌ర్కార్. ఆ మేర‌కు ఎవ‌రు దాడికి పాల్ప‌డ్డారో వారిపై వెంట‌నే కేసు న‌మోదు చేయాల‌ని కోరింది.

దీంతో ఢిల్లీ పోలీసులు పంజాబ్ ఖాకీల‌పై కేసు న‌మోదు చేశారు. ఈనెల 26న ఇంపీరియ‌ల్ హోట‌ల్ లో ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మీడియాతో మాట్లాడారు.

ఆ స‌మావేశంలో ఢిల్లీకి చెందిన జ‌ర్న‌లిస్టు పై దాడి చేశారు. బాధిత జ‌ర్న‌లిస్ట్ ఫిర్యాదు చేయ‌డంతో ఢిల్లీ పోలీస్ కేసు (Police Case)రిజిస్ట‌ర్ చేశారు.

హిందూస్తాన్ పోస్ట్ కోసం ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్ట్ న‌రేష్ వాట్స్ పోల‌సుల‌కు త‌న పీఐబీ ( ప్రెస్ ఇన్ఫ‌ర్మేషన్ బ్యూరో ) జారీ చేసిన గుర్తింపు కార్డును చూపించాడు.

ఆయ‌నా సీఎంల స‌మావేశానికి హాజ‌రు కానీయ‌కుండా అడ్డుకున్నారు. ఆపై ఎందుక‌ని ప్ర‌శ్నించినందుకు త‌న‌పై దాడ‌కి కూడా పాల్ప‌డిన‌ట్టు జ‌ర్న‌లిస్ట్ వాపోయాడు. దాడి గురించి స‌మాచారం ఇచ్చినా ఇద్ద‌రు సీఎంలు ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించాడు.

ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా, చండీగ‌ఢ్ ప్రెస్ క్ల‌బ్ జ‌ర్న‌లిస్ట్ పై దాడిని ఖండించాయి. నిందితులైన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

Also Read : పాటియాలాలో ఖాకీల‌కు షాక్ ఇంట‌ర్నెట్ బ్లాక్

Leave A Reply

Your Email Id will not be published!