Ian Bishop : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా మిగిలి పోయింది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్. ఇప్పటి దాకా 8 మ్యాచ్ లు ఆడింది. ఏ ఒక్కటి గెలవ లేదు.
ఇవాళ మరోసారి రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ దూకుడుతో ఉంది. ఆ జట్టులో అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు సత్తా చాటుతున్నారు.
ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు ముంబై ఇండియన్స్. పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లడం లేదు. కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా గెలుపొంది పోయిన పరువు కాపాడు కోవాలని ఆశిస్తోంది ఆ జట్టు.
ఇప్పటి వరకు పేసర్లు సరిగా ఆడక పోవడంతో హెడ్ కోచ్ కొత్త బౌలర్ ధవళ్ కుల్ కర్ణిని తీసుకున్నాడు. అతడి రాక తోనైనా ఆ జట్టు మారుతుందా అన్నది వేచి చూడాలి.
మొత్తం 14 సీజన్లలో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. ఇంత ఘనమైన చరిత్ర, పటిష్టమైన జట్టు ఉన్నప్పటికీ ఆశించిన మేర రాణించలేక పోతోంది.
ఇదిలా ఉండగా విండీస్ బౌలర్ ఇయాన్ బిషప్(Ian Bishop) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నడూ లేనంతటి టెన్షన్ కు లోనవుతున్నాడని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెప్పాడు.
తను ఏదో కోల్పోయినంత బాధ పడుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు. ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుపొందుతారనేది చెప్పడం కష్టం. ఆటగాళ్లు బాగానే ఉన్నా అవసరమైన సమయంలో రాణించలేక పోతున్నారంటూ తెలిపాడు బిషప్.
Also Read : బెంగళూరు వర్సెస్ గుజరాత్ బిగ్ ఫైట్