LPG Gas Cylinder : ఈ దేశంలో మోదీ ప్రభుత్వం ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోంది. మన్ కీ బాత్ అంటూ జనాన్ని మెస్మరైజ్ చేస్తూ వస్తున్న కేంద్రం ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది.
ప్రముఖ రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నట్లు ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది సర్కార్.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మంట మండుతోంది. ఇంకో వైపు గ్యాస్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇవాళ దేశ వ్యాప్తంగా మేడేను జరుపుకుంటున్నారు.
కానీ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా గ్యాస్ ధరలు (LPG Gas Cylinder)పెంచడంపై మండిపడుతున్నారు. ఇలా ఎంత కాలం పెంచుకుంటూ పోతారని ప్రశ్నిస్తున్నారు.
ఆయిల్ ధరల దెబ్బకు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే ఆయిల్ నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
తాజాగా గ్యాస్ బండ రూపంలో మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇదిలా ఉండగా ప్రతి నెలా ఒకటో తారీఖున సిలిండర్ల ధరలు సవరిస్తుంటాయి.
తాజాగా మళ్లీ ధరా భారం మోపాయి. కమర్షియల్ సిలిండర్ ధర(LPG Gas Cylinder) 19 కేజీలకు రూ. 102.5కి పెరిగింది. దీంతో ఒక్క దేశ రాజధానిలోనే దాని ధర రూ. 2,355 కి చేరింది.
గత నెలలో 250కి పైగా పెంచడం దారుణం. ఇక ఉపశమనం కలిగించిన అంశం ఏమిటంటే ఇళ్లల్లో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
గత మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ. 50కి పెంచారు. హైదరాబాద్ లో దీని ధర రూ. 1002గాఉంది.
Also Read : మత పరమైనది కాదు రాజకీయ ఘర్షణ