Pa Ranjith : ద‌ళిత సాహిత్యం ఎన్నో నేర్పింది

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా.రంజిత్

Pa Ranjith : ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు పా. రంజిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ద‌ళిత సాహిత్యం త‌న‌ను మ‌నిషిని చేసింద‌న్నారు. అంతే కాదు తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని తెలిపాడు.

ద‌ళిత ర‌చ‌న‌లు చ‌దివి ప్ర‌భావితం చెందాన‌ని తెలిపారు. వాటి ద్వారానే తాను సినీ రంగానికి వ‌చ్చాన‌ని, ఆ దిశ‌గా సినిమాలు తీస్తున్నాన‌ని చెప్పారు పా. రంజిత్(Pa Ranjith).

ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కార‌ణం ద‌ళిత సాహిత్యం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. స‌మాజాన్ని ఆవిష్క‌రించాలంటే సినిమాను మించింది మ‌రొక‌టి లేద‌న్నాడు ద‌ర్శ‌క‌, నిర్మాత పా. రంజిత్(Pa Ranjith).

తనే కాదు ఈ దేశంలో కోట్లాది మంది బ‌హుజ‌నులు ఎన్నో ఇబ్బందులు, అవ‌మానాలు ఎదుర్కొంటున్నార‌ని, అలాంటి వారికి వాయిస్ లేకుండా పోయింద‌న్నారు.

అందుకే తాను సినిమాల ద్వారా సామాజిక ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకు సినిమాలు తీస్తున్నాన‌ని చెప్పారు. త‌న చిత్రాలు ఎప్పుడూ స‌మాజంలోని అస‌మాన‌త‌లు, అణ‌గారిన జీవితాల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాన‌ని చెప్పారు పా. రంజిత్.

త‌న‌కంటూ ఓ పంథా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భావి త‌రాల‌కు మేలు చేకూర్చేందుకు వినూత్న ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం తానే స్వ‌యంగా నీలం ఫౌండేష‌న్ ను ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ నెల అంతా ద‌ళిత చ‌రిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక క‌ళ‌లు, ఫోటో ఎగ్జిబిష‌న్ , చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

మ‌ధురైలో ద‌ళిత ర‌చ‌యిత‌ల కోసం ద‌ళిత సాహితీ స‌మావేశాలు ఏర్పాటు చ‌స్త్రశారు. ద‌ళిత సాహిత్యం ఎందుకు అన్న ప్ర‌శ్నను త‌న‌లో క‌లిగించాయ‌ని చెప్పారు పా. రంజిత్.

Leave A Reply

Your Email Id will not be published!