Imran Khan : పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) సంచలన ఆరోపణలు చేశారు. తనను డీ మోరలైజ్ చేసేందుకు తన మాజీ భార్య రెహమ్ ఖాన్ ను పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
అంతే కాదు తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేందుకు ఆమె ఓ పుస్తకం కూడా రాయబోతోందని, ఇందుకు డబ్బులు కూడా ప్రస్తుత సర్కారే సమకూరుస్తోదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ప్రతిపక్షాలను ఇమ్రాన్ ఖాన్ ఓ మాఫియా గా అభివర్ణించారు. ఇందులో భాగంగా మాఫియా మోసారి తనపై హత్యాయత్నం ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఈద్ (రంజాన్ ) తర్వాత ఏదైనా విడుదల చేయవచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు. 2018 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా ఒక బుక్ రాసేందుకు షరీఫ్ కుటుంబం ఒక మహిళకు డబ్బు చెల్లించిందన్నారు. తన మాజీ భార్య రెహమ్ ఖాన్ ను ఉద్దేశంచి ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ లో జరిగిన బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పరోక్షంగా పుస్తకం గురించి ప్రస్తావించారు. తన మొదటి మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ గురించి కూడా మాట్లాడాడు.
షరీఫ్ మాఫియాలో ఆమె కూడా ఓ సభ్యురాలని ఆరోపించాడు ఇమ్రాన్ ఖాన్. నేను జీవించి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు మాజీ ప్రధాన మంత్రి. రెహమ్ ఖాన్ అనే పుస్తకం 2018లో విడుదలైంది.
ఇది ప్రముఖ పాకిస్తాన బ్రిటిష్ జర్నలిస్ట్ . చిత్ర నిర్మాత, రచయిత రెహమ్ రచించారు.
Also Read : ‘టైమ్’ కథనం జెలెన్ స్కీ అంతరంగం