Ajit Pawar : మరోసారి కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం తెర పైకి వచ్చింది. మరాఠా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar)సంచలన కామెంట్స్ చేశారు. కర్ణాటక సరిహద్దులోని కొన్ని ప్రాంతాలలో మరాఠీ మాట్లాడే వాళ్లు ఎక్కువగా ఉన్నారని అన్నారు.
వారి అభీష్టం మేరకు తాము వాటిని కలిపేసు కోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
బెల్గాం, నిపాణీ, కార్వార్ సరిహద్దు ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు మరాఠీ మాట్లాడతారని చెప్పారు. ఇవి కర్ణాటక సరిహద్దు భాగాలు. ఈరోజు వరకు అవి మరాఠాలో కలవాల్సి ఉండింది.
కానీ కలవ లేదన్నారు. అక్కడి వారంతా మహారాష్ట్రలో తమను కలపాలని కోరుతున్నారు. కానీ కర్ణాటక సర్కార్ ఒప్పు కోవడం లేదు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
కానీ మేం చివరి క్షణం దాకా పోరాడుతాం. ఆయా ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు అజిత్ పవార్(Ajit Pawar).
మహారాష్ట్రలో భాగం కావాలంటూ అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారని వారికి తాము సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నామని చెప్పారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నీ మావే. పూర్వం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవి. ఈ ప్రాంతాలన్నీ మరాఠాకు చెందినవేనని మరోసారి స్పష్టం చేశారు అజిత్ పవార్.
ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. కాగా ఈ కేసు సుప్రీంలో నడుస్తోంది. ఇంకా తేలాల్సి ఉంది.
Also Read : పెండింగ్ లో 40 మిలియన్ల కేసులు – సీజేఐ