Raj Thackeray : మహా నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరేపై మరాఠా సర్కార్ కేసు నమోదు చేసింది. ఈనెల 4వ తేదీ లోపు రాష్ట్రంలోని మసీదుల వద్ద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను వెంటనే తీసి వేయాలంటూ డెడ్ లైన్ విధించారు.
ఈనెల 3 వరకు గడువు ఇస్తున్నామని ఇక 4న ఏం జరిగినా తాము బాధ్యత వహించ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజున ఆయా లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణం వినిపిస్తామని స్పష్టం చేశారు రాజ్ థాకరే(Raj Thackeray ).
ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే అగ్ని గుండం అవుతుందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు.
మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, రాష్ట్ర పోలీస్ చీఫ్ రజనష్ సేథ్ , సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు.
మసీదుల వద్ద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను మూసి వేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు రాజ్ థాకరే(Raj Thackeray ). రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై పోలీస్ కేసు నమోదు చేశారు.
శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పని చేస్తున్న పోలీసులకు ముందస్తు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. కాగా రాజ్ థాకరేపై ఔరంగాబాద్ పోలీస్ కమిషనర్ తగిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటారని మహారాష్ట్ర పోలీస్ చీఫ్ రజనీష్ సేథ్ వెల్లడించారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ఔరంగాబాద్ సీపీ ప్రసంగాన్ని పరిశీలిస్తున్నారు. ఇవాళే చట్ట పరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
Also Read : బసవేశ్వరుడి జీవితం స్పూర్తిదాయకం