Modi : మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత దేశ ప్రధాన మంత్రి యూరప్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన జర్మనీ చాన్స్ లర్ తో ములాఖత్ అయ్యారు. ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. అనంతరం ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అపూర్వమైన రీతిలో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు వందేమాతరం, జనగణమన జాతీయ గీతాలు ఆలాపించారు.
ప్రధాని మోదీ (Modi )అమితమైన ఆనందానికి లోనయ్యారు. ప్రవాస భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలు మరిచి పోవడం లేదన్నారు. ఇది భారత సంస్కృతిలో అంతర్భాగంగా అనాది నుంచి వస్తున్నదని కొనియాడారు.
అనంతరం కోపెన్ హాగన్ లో ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికారు డెన్మార్క్ (డావిష్ ) ప్రధాన మంత్రి. భారత ప్రదాన మంత్రి తన తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. మారియన్ బోర్గ్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ఫ్రెడరికక్ సన్ స్వాగతం పలికారు.
ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాల నుంచి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే వరకు చర్చలు జరిపారు. కాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సంతోషం వ్యక్తం చేశారు.
మోదీ యూరప్ టూర్ ను దేశ చరిత్రలో మైలురాయిగా అభివర్ణించారు. ఆయా దేశాలన్నీ భారత దేశంతో ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నాయని వెల్లడించారు.
కీలక అంశాలు ఇద్దరు ప్రధానుల మధ్య చర్చకు వచ్చాయని వెల్లడించారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు