PM Modi : ఫ్రాన్స్ భార‌త్ బంధం బ‌లోపేతం

మాక్రాన్ తో భేటీ అయిన మోదీ

PM Modi : భార‌త్, ఫ్రాన్స్ దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi). యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఫ్రాన్స్ లో తాజాగా అధ్య‌క్షుడిగా రెండోసారి గెలుపొందిన మాక్రాన్ తో భేటీ అయ్యారు ప్ర‌ధాని.

త‌న‌కు అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడిగా అభివ‌ర్ణించారు మోదీ. జ‌ర్మ‌నీతో పాటు డెన్మార్క్ ను ప‌ర్య‌టించారు. కీల‌క అంశాల గురించి చ‌ర్చించారు.

ఆయా దేశాల‌తో స‌త్ సంబంధాలు కొన‌సాగించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు ప్ర‌ధాన మంత్రి. మూడు రోజుల టూర్ లో భాగంగా చివ‌రి రోజు మోదీ ఫ్రాన్స్ లోని పారిస్ లో ఆ దేశ అధ్య‌క్షుడు మాక్రాన్ తో ములాఖ‌త్ అయ్యారు.

ఉక్రెయిన్ పై ర‌ష్యా దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డుత‌న్న నేప‌థ్యంలో ప్ర‌ధాని చ‌ర్చించాచ‌రు. ద్వైపాక్షిక‌, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌తో పాటు ప్రాంతీయ‌, ప్ర‌పంచ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

ఈ స‌మావేశం భార‌త దేశం – ఫ్రాన్స్ దేశాల మ‌ధ్య స్నేహానికి మ‌రింత ఊపు నిస్తుంద‌ని పేర్కొంది ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఫ్రెంచ్ అధ్య‌క్షుడి అధికారిక నివాస‌మైన ఎలిసీ ప్యాలెస్ లో ప్ర‌తినిధుల స్థాయి చ‌ర్చ‌ల‌కు ముందు మాక్రాన్ ప్ర‌ధాని మోదీ (PM Modi) తో టెట్ ఎ టెట్ నిర్వ‌హించారు.

ఇరు దేశాలు గ‌త కొంత కాలం నుంచి స్నేహాన్ని కోరుతూ దానిని కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నాయి. ఇవాళ భార‌త్ మ‌రో అడుగు ముందుకేసింది.

ఫ్రాన్స్ చీఫ్ మాక్రాన్ తో వ్య‌క్తిగ‌త‌మైన అనుబంధం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఉంద‌న్నారు విదేశాంగ శాఖ మంత్రి అరింద‌మ్ బాగ్చీ.

Also Read : జోధ్ పూర్ ఘ‌ర్ష‌ణ‌లో 52 మంది అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!