President Neet Bill : రాష్ట్రపతి పరిశీలనకు నీట్ వ్యతిరేక బిల్లు
పంపించిన తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి
President Neet Bill : తమిళనాడులో గవర్నర్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య పొసగడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
దాంతో గవర్నర్ రవి నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ నీట్ వ్యతిరేక బిల్లును గత ఏడాది గవర్నర్ తిరిగి పంపారు.
రెండోసారి నీట్ వ్యతిరేక బిల్లు శాసనసభలో నీట్ వ్యతిరేక బిల్లుకు తిరిగి ఆమోదం తెలిపి గవర్నర్ రవికి పంపించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యార్థులను నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా నీట్(President Neet Bill) నుండి మినహాయించాలని కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపింది.
గవర్నర్ ఆర్.ఎన్. రవి నీట్ వ్యతిరేక బిల్లును కేంద్ర హొం మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపారు. ఇదిలా ఉండగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి నట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ కేంద్ర హోం మంత్రికి పంపారు.
బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తారని తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
నీట్ మినహాయింపు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ రెండు సార్లు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపనందుకు ద్రవిడ మున్నేట కజగం లేదా డీఎంకే , దాని మిత్రపక్షాలు గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి.
తమిళనాడు రాష్ట్ర మంత్రులు మా సుబ్రమణియన్ , తంగం తెన్నారసు నీట్ (President Neet Bill) వ్యతిరేక బిల్లును రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ ను కలిసి విన్నవించారు.
Also Read : తల్లి ఆశీర్వాదం యోగి ఆనందం