Shiv Sena Samna : భారతీయ జనతా పార్టీపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నైట్ క్లబ్ విషయంపై స్పందించింది.
రాజకీయ నాయకులు ఎవరూ ఇతర దేశాలకు ప్రైవేట్ పర్యటన చేయలేదా, అక్కడి హొటళ్లలో నైట్ క్లబ్ లను వారు సందర్శించ లేదా అంటూ నిలదీసింది.
ప్రతి వారం శివసేన తన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనికి గౌరవ సంపాదకుడిగా శివసేన (Shiv Sena)అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ ఉన్నారు.
ఖాట్మాండ్ లో నైట్ క్లబ్ కు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. ఓ వైపు దేశంలో విద్యుత్ , బొగ్గు కొరతతో కొట్టు మిట్టాడుతోంది.
ఇంకో వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ పెరుగుతూనే ఉందని ఆరోపించింది. వీటిని కంట్రోల్ చేయకుండా ఫక్తు రాజకీయాలు చేస్తూ కాలాన్ని వెలిబుచ్చు తోందంటూ బీజేపీపై నిప్పులు కురిపించింది.
కాగా ఈ వివాదం ఊహించనది కాదని హిజాబ్ నుంచి లౌడ్ స్పీకర్ దాకా భారతీయ జనతా పార్టీ ఏదైనా రాజకీయం చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుందని ఎద్దేవా చేసింది సామ్నా(Shiv Sena) సంపాదకీయం.
రాజస్థాన్ లో జరిగిన అల్లర్లపై రాహుల్ గాంధీకి బాధ్యత లేదా అని అడుగుతోంది బీజేపీ. జోధ్ పూర్ దేశంలో భాగమే. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఎందుకు మాట్లాడడం లేదని నిలదీసింది శివసేన.
Also Read : ‘చాలీసా’కు లౌడ్ స్పీకర్లు ఎందుకు