KC Venugopal : దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి రూట్ మ్యాప్ సిద్దం చేసి ఇచ్చారు.
గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇవ్వడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఆయన పార్టీలో చేరలేదు. స్వంతంగా తన పని తాను చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో పీకే చేరుతారన్న ప్రచారానికి తెర పడింది.
ఆయన ఇవాళ తాను అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బతికి బట్ట కట్టాలంటే, పవర్ లోకి రావాలన్నా లేదా బలమైన ప్రతిపక్షంగా ఉండాలన్నా కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. చాలా చోట్ల అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. పార్టీని ఏకతాటిపై నడిపే నాయకత్వం కరువైందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ తరుణంలో రాజస్థాన్ వేదికగా ఆ పార్టీ చింతన్ శిబిరం నిర్వహిస్తోంది. ఇందులో భారీగా మార్పులు ఉండ బోతున్నట్లు ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి కేసీ వేణుగోపాల్(KC Venugopal )వెల్లడించారు.
పార్టీ సిద్దాంత విషయాల్లో కూడా కొంత మార్పు ఉండనుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాల వల్ల పెద్ద గేమ్ ఛేంజర్ కాబోతున్నట్లు వెల్లడించారు. చింతన శిబిరంలో ఇదే ప్రధాన కేంద్రంగా చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.
మొత్తం ఆరు గ్రూపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గ్రూపులు వివిధ అంశాలపై లోతుగా చర్చలు జరుపుతాయని తెలిపారు.
Also Read : విద్యుత్ వినియోగంపై కేజ్రీవాల్ ప్రకటన