David Warner : వారెవ్వా వార్న‌ర్ ఆట అదుర్స్

92 ర‌న్స్ 12 ఫోర్లు 3 సిక్స‌ర్లు

David Warner : డేవిడ్ వార్న‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎన్నో అవ‌మానాలు మ‌రెన్నో ఇబ్బందులు వాట‌న్నింట‌ని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. గ‌త ఏడాది 2021లో జ‌రిగిన ఐపీఎల్ ఆసిస్ స్టార్ వార్న‌ర్ (David Warner) కు చేదు అనుభ‌వ‌మే మిగిలింది.

తాను ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మే కాదు ఆ జ‌ట్టుకు టైటిల్ తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కూడా వార్న‌ర్ దే. కానీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం డేవిడ్ వార్న‌ర్ ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణి ప్ర‌ద‌ర్శించింది.

దీని వెనుక కార‌ణం ఏమిట‌నేది అటు మేనేజ్ మెంట్ కానీ ఇటు వార్న‌ర్ (David Warner)  కానీ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కెప్టెన్ గా తీసేశారు. జ‌ట్టులో లేకుండా చేశారు. చివ‌ర‌కు 12వ ఆట‌గాడిగా పెట్టారు.

అయినా మ‌నోడు బాధ ప‌డ‌లేదు. త‌న ప్లేయ‌ర్ల‌కు కూల్ డ్రింక్స్ మైదానంలోకి తీసుకు వ‌చ్చాడు. కానీ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. కానీ అదే దుబాయి వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు.

తానేమిటో త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఆ నాటి నుంచి నేటి దాకా వెనుదిరిగి చూడ‌లేదు. ఇక ఐపీఎల్ మెగా వేలం పాట ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగింది.

స‌న్ రైజ‌ర్స్ అత‌డిని తీసుకోలేదు. పై పెచ్చు ఘోరంగా అవ‌మానించింది. ఏ జ‌ట్టు కూడా అత‌డిని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కానీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముందుకు వ‌చ్చింది.

త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచుకునేలా ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో జోస్ బ‌ట్ల‌ర్ త‌ర్వాతి స్థానంలో వార్న‌ర్ ఉన్నాడు.

ఏ జ‌ట్టు అయితే త‌న‌ను ఇబ్బంది పెట్టిందో ఆ జ‌ట్టుపైనే క‌సి తీరా ఆడాడు. 92 ర‌న్స్ చేశాడు. ఇందులో 12 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

Also Read : రాహుల్ ద్ర‌విడ్ లివింగ్ లెజెండ్ – శాంస‌న్

Leave A Reply

Your Email Id will not be published!