India Govt : కరోనా మరణాల నివేదికపై కేంద్రం గుస్సా
డబ్ల్యుహెచ్ఓ రిపోర్డు పూర్తిగా అబద్దం
India Govt : అనుకున్న దాని కంటే ఎక్కువగా కరోనా మరణాలు భారత్ లో చోటు చేసుకున్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) వెల్లడించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది(India Govt).
ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఎలా నివేదికలో వెల్లడిస్తుందంటూ ప్రశ్నించింది. ఇది పూర్తిగా నిరాధారమైనదని కుండ బద్దలు కొట్టింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
కోవిడ్ మరణాల సంఖ్యను లెక్కించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణిత నమూనాను ఉపయోగించడాన్ని భారత దేశం గట్టిగా ఖండించింది. వాస్తవాలు లేకుండా అబద్దాలను ప్రచారం చేసిందంటూ మండిపడింది(India Govt).
డబ్ల్యుహెచ్ఓ డేటా సేకరణ వ్యవస్థ పూర్తిగా అశాస్త్రీయమని పేర్కొంది. గురువారం విడుదల చేసిన నివేదికలో జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్య భారత దేశంలో 4.7 మిలియన్ల అదనపు కోవిడ్ మరణాలు నమోదైనట్లు వెల్లడించింది.
ఇది గరిష్ట సంఖ్య అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు గా ఉందంటూ తెలిపింది. ప్రపంచ సంఖ్య 15 మిలియన్లు ఉండగా అధికారిక సంఖ్య 6 మిలియన్ల కంటే రెట్టింపుగా ఉందని పేర్కొంది.
2020లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కింద భారత దేశంలో 4, 74 , 806 మరణాలు అధికంగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాము అభ్యంతరం వ్యక్తం చేసినా కంటిన్యూగా పట్టించు కోకుండానే రిలీజ్ చేయడం దారుణమని పేర్కొంది.
కోవిడ్ మరణాలను అంచనా వేయడంలో తప్పు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రభుత్వం(India Govt) అందించిన ఏ వివరాలను సదరు సంస్థ పరిగణలోకి తీసుకోలేదు.
ఇదంతా చూస్తుంటే భారత్ ను ప్రపంచ బోనులో దోషిగా నిలబెట్టాలన్న దుగ్ధ అర్థం అవుతోందంటూ మండి పడింది.