JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఓ వైపు మత ఘర్షణలు చోటు చేసుకుంటుంటే వాటి గురించి మాట్లాడ లేదు. కానీ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇస్లామిక్ టెర్రరిజానికి కేరళ కేంద్రంగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గాన్ని సమానంగా చూస్తుందన్న అభిప్రాయాన్ని కలగ చేస్తోందని ఎద్దేవా చేశారు.
కానీ అది ఆచరణలో కనిపించడం లేదన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ ఆరోపించారు.
కోజికోడ్ లో కాషాయ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేరళ సర్కార్ విధానం సూడో సెక్యులరిజం అని మండిపడ్డారు.
సమాజంలోని ఒక వర్గానికి ప్రత్యేక హోదా కల్పించి ఇతర వర్గాలను పక్కన పెట్టడం లేదా విభజించి పాలించడం అని ఆరోపించారు జేపీ నడ్డా(JP Nadda). ఇస్లామిక్ ఉగ్రవాదం సీపీఎం సర్కార్ నుంచి ప్రోత్సాహం పొందుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది రాష్ట్రంలో జరుగుతున్న జనాభా మార్పులపై మత పరమైన సంఘాలు, ప్రధానంగా కేరళ లోని క్రైస్తవులు ఆందోళన చెందుతున్నారని అన్నారు జేపీ నడ్డా(JP Nadda).
సీఎం పినరయి విజయన్ కొన్ని వర్గాలకే వత్తాసు పలుకుతున్నారంటూ ధ్వజమెత్తారు బీజేపీ చీఫ్. 2016లో 55 రాజకీయ హత్యలు జరిగాయి. సీఎం సొంత జిల్లా కన్నూర్ లో 12 జరిగాయి.
రాష్ట్రంలో హింస, హత్యలు, వ్యవస్థీకృత నేరాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. కేరళలో అవినీతి పాలన జరుగుతోందన్నారు నడ్డా.
Also Read : ‘బగ్గా’ అరెస్ట్ పై భగ్గుమన్న సిద్దూ