Rovman Powell : వార్న‌ర్ క్రీడా స్పూర్తికి పావెల్ ఫిదా

ఎవ‌రున్నా సెంచ‌రీకే ప్రిఫర్

Rovman Powell  : ఆసిస్ స్టార్ డేవిడ్ వార్న‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మోస్ట్ పాపుల‌ర్ స్టార్ హిట్ట‌ర్ గా పేరొందాడు. వ‌ర‌ల్డ్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ ల‌లో స‌త్తా చాటుతూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నాడు.

2021లో జ‌రిగిన 14వ సీజ‌న్ లో వార్న‌ర్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. కానీ ప‌డి లేచిన కెర‌టంలా మళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు..

అంత‌కు ముందు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు కెప్టెన్ గా ఉన్నాడు.

స‌రిగా ఆడ‌డం లేద‌న్న నెపంతో జ‌ట్టు మేనేజ్ మెంట్ ఊహించ‌ని రీతిలో ప‌క్క‌న పెట్టింది.

తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింది. కెప్టెన్ ప‌ద‌విని పీకేసి ఏకంగా 12వ ఆట‌గాడిగా ప‌రిమితం చేసింది.

అయినా ఎక్క‌డా ప‌ల్లెత్తు మాట అన‌లేదు ఎస్ ఆర్ హెచ్ పై. కన్నీళ్ల‌ను లోలోపటే దాచుకుని మ‌ళ్లీ ఆట‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టాడు.

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌రల్డ్ క‌ప్ లో ఆస్ట్రేలియాకు టైటిల్ ను తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీలలో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ డేవిడ్ వార్న‌ర్ రిటైన్ చేసుకోలేదు.

10 జ‌ట్ల‌కు సంబంధించి మేనేజ్ మెంట్లు పాల్గొన్నా వార్న‌ర్ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు.

ఈ త‌రుణంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక్క‌టే అత‌డిపై న‌మ్మ‌కాన్ని ఉంచింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు.

ఆరేంజ్ క్యాప్ రేసులో జోస్ బ‌ట్ల‌ర్ తో పాటు కేఎల్ రాహుల్ , డేవిడ్ వార్న‌ర్ ఉన్నాడు.

కాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో వార్న‌ర్ తో పాటు రోవ్ మాన్ పావెల్(Rovman Powell )అద్భుతంగా ఆడారు.

ఇదే స‌మ‌యంలో 92 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

పావెల్ దంచి కొట్టాడు. ఇదే స‌మ‌యంలో ఇంకో ప్లేయ‌ర్ ఉంటే సెంచ‌రీ చేసేందుకు మొగ్గు చూపేవాడు. కానీ వార్న‌ర్ వ‌ద్ద‌ని వారించాడు. పావెల్ జోష్ మీదున్నాడు. అత‌డికే ఛాన్స్ ఇచ్చాడు.

సెంచ‌రీ కంటే జ‌ట్టు గెలుపు ముఖ్య‌మ‌ని క్రీడా స్పూర్తి చాటాడ‌ని ఈ సంద‌ర్భంగా పావెల్ వార్న‌ర్ ను ఆకాశానికి ఎత్తేశాడు.

Also Read : రాజ‌స్థాన్ వ‌ర్సెస్ పంజాబ్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!