Rahul Gandhi : లక్ష్మణ రేఖ దాటితే వేటు తప్పదు
ఇక్కడ కాదు గ్రామాల్లో ఉండాలి
Rahul Gandhi : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్ తోనే. మన పార్టీకి లక్ష్మణ రేఖ అన్నది ఒకటి ఉంది. దానిని దాటాలని ప్రయత్నిస్తే వేటు వేయక తప్పదని హెచ్చరించారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఆయన తెలంగాణలో జరిగిన రెండు రోజుల టూర్ సక్సెస్ అయ్యింది. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ లో కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అనంతరం చెంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ విద్యార్థి నాయకులను పరామర్శంచారు.
అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ లో కాదు ఉండాల్సింది గ్రామాల్లో, నియోజకవర్గాలలో ఉండాలన్నారు. ఎవరు గీత దాటినా వేటు తప్పదని హెచ్చరించారు.
పార్టీకి చెందిన వారు ఢిల్లీకి రావద్దని సూచించారు. ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది పూర్తి సర్వే ఆధారంగా, వారు చేసిన పని ఆధారంగా కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితికి డబ్బు, పోలీస్ బలం ఉందని కానీ జన బలం లేదని ఎద్దేవా చేశారు.
ఎవరి మాటలు నమ్మవద్దు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదంటూ మరోసారి ప్రకటించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
తాను ఎవరిని అడిగినా చెప్పేలా ఉండాలన్నారు. 12 ఏళ్ల పిల్లాడిని అడిగినా ఈ డిక్లరేషన్ చెప్ప గలిగే స్థాయికి తీసుకు రావాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. అనంతరం మేధావులు, టీవీ చానళ్ల చీఫ్ లతో రాహుల్(Rahul Gandhi) భేటీ అయ్యారు.
Also Read : బోర్డింగ్ ప్యాసింజర్స్ కు ఇబ్బంది కలిగిస్తే చర్య