Chris Gayle : గుర్తింపు లేకనే ఐపీఎల్ కు దూరం
సరిగా వ్యవహరించ లేదని ఆవేదన
Chris Gayle : వరల్డ్ క్రికెట్ లో టాప్ హిట్టర్ గా పేరొందిన క్రికెటర్ క్రిస్ గేల్. ఐపీఎల్ అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించాడు. తాజాగా ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ 2022లో ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలు సాధించి గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
కరోనా కారణంగా బయో బబూల్ లో ఉండలేక ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 వ తేదీలలో బెంగళూరు వేదిక గా జరిగిన మెగా ఐపీఎల్ వేలం పాటకు దూరంగా ఉన్నాడు క్రిస్ గేల్(Chris Gayle).
తాను దూరంగా ఉంటానని ఇటీవలే ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లలో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పలు పరుగులు చేశాడు.
అయితే తనకు సరైన గౌరవం లభించ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు క్రిస్ గేల్. ఆడిన ప్రతి సీజన్ లోనూ తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడాడు.
ఎన్నో విజయాలలో పాలు పంచుకున్నా. నాతో ఆయా జట్ల యాజమాన్యాలు వ్యవహరించిన తీరు మాత్రం సవ్యంగా లేదన్నాడు. పలు కీలక విజయాలలో కీలక భూమిక పోషించా. అందుకే ఈసారి ఐపీఎల్ లో ఆడ కూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
రావాల్సినంత గుర్తింపు, గౌరవం దక్కలేదని సంచలన కామెంట్స్ చేశాడు క్రిస్ గేల్. ఎవరినీ ఇబ్బంది పెట్ట కూడదనే తాను తప్పుకున్నానని ఇందులో తాను ఎవరినీ నిందించ దల్చు కోలేదన్నాడు.
ఇదిలా ఉండగా క్రిస్ గేల్(Chris Gayle) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఐపీఎల్ లో ఆడాడు. ఆర్సీబీ, పంజాబ్ తో ఆడినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశానని అన్నాడు.
Also Read : కెప్టెన్ కాకుండా కుట్ర పన్నారు