Revanth Reddy : కేటీఆర్ నీ తండ్రి చరిత్ర తెలుసుకో
నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : కాంగ్రెస్ అగ్ర నాయకుడిపై అవాకులు చెవాకులు పేలిన మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). తమ నాయకుడి గురించి పొలిటికల్ టూరిస్ట్ అంటూ పేర్కొనడాన్ని తప్పు పట్టారు.
ఇంకోసారి నోరు జారినా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎదుటి వాళ్లను విమర్శించే ముందు నీ తండ్రి కేసీఆర్ అసలు చరిత్ర తెలుసుకుంటే బెటర్ అని హితవు పలికారు. దుబాయ్ శేఖర్ అన్న పేరు ఎవరిదో కేటీఆర్ కు తెలుసా అని ప్రశ్నించారు.
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస పార్టీ అన్న సంగతి మరిచి పోతే ఎలా అని నిలదీశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తన తండ్రి రాజకీయ ప్రస్థానం పరాజయంతోనే ప్రారంభమైందన్న సంగతి మరిచి పోతే ఎలా అన్నారు.
జనం ఆగ్రహం తట్టుకోలేక భయంతో వేర్వేరు చోట్లల్లో పోటీ చేసిన నీచమైన చరిత్ర నీ తండ్రిది కాదా అని మండిపడ్డారు. దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్ట లేదన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు.
తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతింటున్న ఏకైక ఫ్యామిలీ మీది కాదా అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. శరద్ పవార్, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ , ఉద్దవ్ థాకరే, మమతా బెనర్జీ దగ్గరికి కాళ్లు కాలిన పిల్లిలా తిరిగిన కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్ కాక ఇంకేమనాలో కేటీఆర్ చెప్పాలన్నారు.
Also Read : లక్ష్మణ రేఖ దాటితే వేటు తప్పదు