Sanjay Raut : రాజ్ థాకరేను రాముడు ఆశీర్వదించడు
రాజ్ థాకరే సంజయ్ రౌత్ డైలాగ్ వార్
Sanjay Raut : మరాఠాలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే శివసేన పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. హనుమాన్ చాలీసా , లౌడ్ స్పీకర్ల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాలకు, రాద్దాంతానికి తెర లేపింది.
ఇదే చాలీసా విషయంపై అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 12 రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. కోర్టు వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా నవనీత్ కౌర్ మరాఠా సీఎం ఉద్దవ్ థాకరే కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాజాగా రాజ్ థాకరే , శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut) మధ్య మాటల యుద్దం మళ్లీ మొదలైంది.
తాజాగా రాజ్ థాకరే , మేనల్లుడు సీఎం తనయుడు ఆదిత్యా థాకరే ఇద్దరూ వచ్చే జూన్ నెల 10న అయోధ్య రామజన్మ భూమిని సందర్శించనున్నారు.
ఇదిలా ఉండగా లౌడ్ స్పీకర్ల వివాదం ఇంకా చల్లారక ముందే శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నేతలు కత్తులు దూస్తున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
జూన్ 5న రాజ్ థాకరే అయోధ్యకు వెళతారు. ఇదే సమయంలో ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్యా థాకరే 10న దేశ వ్యాప్తంగా ఉన్న శివసేన కార్యకర్తలతో కలిసి అయోధ్యకు వెళ్లనున్నారు.
ఇద్దరూ రామ మందిరాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) నిప్పులు చెరిగారు రాజ్ థాకరేను. ఆయన అయోధ్య పర్యటనపై స్పందిఒంచారు.
తప్పుడు భావోద్వేగాలతో , రాజకీయ కారణాలతో తన వద్దకు వచ్చే వారిని రాముడు ఆశీర్వదించడంటూ ఎద్దేవా చేశారు.
Also Read : ఖలేజా ఉంటే నాపై పోటీకి దిగు