Jill Biden : రష్యా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఉక్రెయిన్ పై వార్ కొనసాగిస్తూనే ఉంది. యావత్ ప్రపంచం నెత్తీ నోరు బాదుకున్నా, అమెరికా , ఐరోపా దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినా ఈరోజు వరకు రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డోంట్ కేర్ అంటున్నారు.
భారత్, చైనా తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
తాజాగా అమెరికా ప్రథమ పౌరురాలు జోసెఫ్ బైడెన్ భార్య జిల్ బైడెన్(Jill Biden )ఆకస్మికంగా యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ ను సందర్శించారు.
విచిత్రం ఏమిటంటే ప్రెసిడెంట్ కానీ లేదా ఆయన సతీమణి కాని పర్యటిస్తున్నారంటే భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు.
కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే జిల్ బైడెన్(Jill Biden )పర్యటించడం విస్తు పోయేలా చేసింది. ఇది ఊహించని పరిణామం. స్లొవేకియా లోని సరిహద్దు నుంచి వాహనంలో ప్రయాణం చేశారు.
ఉక్రెయిన్ లోని ఉజ్ హోరోత్ నగరానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలకు పైగా గడిపారు. బాధితులను పరామర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కీతో భేటీ అయ్యారు.
మదర్స్ డే ను పురస్కరించుకుని తాను ఇక్కడికి వచ్చానని ఈ సందర్భంగా జిల్ బైడెన్ వెల్లడించారు. వీరిద్దరూ కలిసి ఓ బడిలో పిల్లలను పరామర్శించారు.
వారికి భరోసా కల్పించారు. ఉక్రెయిన్ దేశానికి, ఆ దేశ ప్రజలకు, బాధితులకు అమెరికా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్నారు.
Also Read : శ్రీలంకలో అత్యవసర పరిస్థితి