Modi : కామారెడ్డి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల సాయం
Modi : దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాన మంత్రి(Modi).
ఈ మేరకు ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లాలోని ఎల్లారెడ్డి – బాన్సు వాడ రహదారిపై అన్నాసాగర్ తండా సమీపంలో లారీ ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో 16 మంది గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్.
మంత్రి కేటీఆర్ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాన్సు వాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వం వారందరికీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు(Modi). రోడ్డు ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఆస్పత్రి వర్గాలను అప్రమత్తం చేశారు. ఇక ప్రమాద ఘటన జరిగిన చోట పరిస్థితి భయానకంగా మారింది. మరో వైపు ప్రమాదం జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Also Read : కేటీఆర్ నీ తండ్రి చరిత్ర తెలుసుకో