Mahinda Rajapaksa : ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేశారు. తీవ్ర రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
ప్రధాని ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో అధ్యక్షుడు రాజపక్సే(Mahinda Rajapaksa )అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ లోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తాను తప్పుకుంటున్నట్లు రాజపక్స ప్రకటించారు. ఇదిలా ఉండగా సాధారణ ప్రజలు ఆవేశానికి లోను కావద్దని, సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు
. ఆ కొద్ది సేపటికే ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలుగొతున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నిరసన తీవ్రతరం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మహింద రాజపక్స రాజీనామా చేశారు.
సంక్షోభంలో కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు గాను ప్రధాని పదవి నుంచి వైదొలగాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే(Mahinda Rajapaksa )ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రిని అభ్యర్థించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రధాని రాజీనామా చేయడంతో అధ్యక్షుడు రాజపక్సే అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ లోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు.
అంతకు ముందు ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ (ఎస్జీబీ) దాని నాయకుడు సజిత్ ప్రేమదాస మధ్యంతర ప్రభుత్వంలో ప్రధాన మంత్రి పదవిని అంగీకరించ బోమంటూ ధ్రువీకరించింది.
Also Read : ఉక్రెయిన్ కు అమెరికా అండ – జిల్ బైడెన్