CWC : కాంగ్రెస్ పార్టీలో స్వీయ విమర్శ, ఆత్మ పరిశీలన అత్యంత అవసరమని స్పష్టం చేసింది ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(CWC ). పార్టీ ఫోరమ్ లలో దీనిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని స్పష్టం చేసింది.
మే 13 నుండి 15 వరకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనున్న మేధో మథన సమావేశానికి సంబంధించిన విధి విధానాలు, ఎజెండాను రూపొందించేందుకు కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో భేటీ అయింది.
మూడు రోజుల చింతన్ శివారుకు కేవలం మూడు రోజుల ముందు జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ , రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు.
వీరితో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. చివరి ముగింపు సమావేశంలో త్వరలో చింతన్ శిబిర్ ను నిర్వహించాలని ప్రకటించారు సోనియా గాంధీ.
13 నుంచి 15 దాకా ఉదయ్ పూర్ లో సమావేశం కాబోతున్నాం. ఇందులో 400 మంది ఆహ్వానితులు, ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ చింతన్ శిబర్ లో 2024లో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా అయ్యేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంతే కాకుండా పార్టీలో ఎవరైనా సరే ఒకే ఒక్క పదవి కలిగి ఉండాలని స్పష్టం చేశారు సోనియా గాంధీ.
15న ఉదయ్ పూర్ నవ్ సంకల్ప్ లో సీడబ్ల్యూసీ ప్రధాన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Also Read : ఢిల్లీలో కూల్చివేతలపై జనాగ్రహం