Explosion Punjab : పంజాబ్ ఇంటెలిజెన్స్ ఆఫీసులో పేలుడు
దుండగుల పనేనంటూ పోలీసుల అనుమానం
Explosion Punjab : ఓ వైపు జమ్మూ కాశ్మీర్ లో ముష్కరుల వేట సాగుతోంది. ఇంకో వైపు దాడులకు తెగ బడుతున్నారు దండుగులు. తాజాగా పంజాబ్ ఇంటెలిజెన్స్(Explosion Punjab) విభాగం ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది.
రాత్రి జరిగిన ఈ ఘటనతో రాష్ట్రమంతా హై అలర్ట్ అయ్యింది(Explosion Punjab). ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ నెలకొంది. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరా తీశారు.
కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పీజీ) విసిరారని పోలీసులు వెల్లడించారు. ఈ భారీ పేలుడు వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోయినా పెద్ద ఎత్తున ఫర్నీచర్ , కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఉగ్ర వాద దాడి కాదని పేర్కొంటున్నారు. సీనియర్ పోలీసు ఆఫీసర్ నేతృత్వంలో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఎవరు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చనే దానిపై ఆరా తీస్తున్నారు. సెక్టార్ 77, సాస్ నగర్ లో ఉన్న పంజాబ్ ఇంటెలిజెన్స్(Explosion Punjab) హెడ్ క్వార్టర్స్ లో సోమవారం రాత్రి 7.45 సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సీనియర్ ఆఫీసర్ల టీం రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నిపుణులు విచారణ చేపట్టారు. ఉగ్ర మూకలు దాడికి పాల్పడ్డాయా లేక ఆఫీసులోని పేలుడు పదార్థాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.
ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను వెంటనే అందజేయాల్సిందిగా పోలీస్ చీఫ్ ను ఆదేశించారు. ఇదే సమయంలో ముందు జాగ్రత్తగా చండీగడ్ పోలీసుల క్విక్ రియాక్షన్ టీమ్ ని ఇంటెలిజెన్స్ ఆఫీస్ భవనం వద్ద ఏర్పాటు చేశారు.
Also Read : ఐసీయూలో భారత రూపాయి – రాహుల్