Dimitry Rogozin : మేం కన్నెర్ర చేస్తే నాటో నాశనమే
రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ రోగోజిన్
Dimitry Rogozin : రష్యా మరోసారి విరుచుకు పడింది. జర్మనీపై రష్యా సాధించిన విక్టరీకి గుర్తుగా జరిగిన విక్టరీ వేడుకలలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాతృభూమి కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు వెలకట్ట లేనివని అన్నారు.
ఇదే సమయంలో రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ దిమిత్రి రోగోజిన్(Dimitry Rogozin) సంచలన కామెంట్స్ చేశారు. తాము అణ్వాయుధాలు ప్రయోగిస్తే నాటో దేశాలను కేవలం 30 నిమిషాల్లో నాశనం చేయగలమంటూ ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి దాకా రష్యా అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతోందంటూ అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్దానికి పాల్పడుతోంది. యావత్ ప్రపంచం మొత్తం యుద్దాన్ని నిలుపుదల చేయాలని కోరుతోంది. అన్నింటిని పక్కన పెట్టిన రష్యా ఏకపక్షంగా దాడులకు దిగుతోంది.
రష్యా చేసిన దాడుల దెబ్బకు ఇప్పటికే ఉక్రెయిన్ పూర్తిగా దెబ్బతింది. కోలుకోలేని స్థితికి చేరుకుంది. లెక్కించ లేనంత మంది బాంబుల మోతలతో, రాకెట్ దాడులతో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయలుగా మారారు.
ఊహించని రీతిలో ఆస్తి నష్టం వాటిల్లింది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యా పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని రష్యా తట్టుకోలేక పోతోంది. రష్యా ప్రధానంగా నాటోను టార్గెట్ చేసింది(Dimitry Rogozin).
ఇందులో భాగంగా నాటో దేశాలకు రష్యా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. తమ జోలికి వస్తే నాశనం తప్ప ఇంకోటి ఉండదని హెచ్చరించింది. పశ్చి దేశాలు కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్నాయని ఆరోపించారు రోగోజిన్.
Also Read : మాతృభూమి కోసం సైనికుల పోరాటం