Mahinda Rajapaksa : నేవీ స్థావరంలో దాచుకున్న రాజపక్స
దేశం విడిచి పారిపోకుండా కట్టుదిట్టం
Mahinda Rajapaksa : ద్వీప దేశం అల్లర్లు, ఆందోళనలు, నిరసనకారులతో అట్టుడుకుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శ్రీలంక సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పటికే ఓ ఎంపీని చంపేశారు. ఆపై ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి ఇళ్లకు నిప్పంటించారు. అనంతరం దేశ అధ్యక్షుడు రాజపక్సే(Mahinda Rajapaksa) ఉంటున్న నివాసంపై దాడి చేసేందుకు యత్నించారు.
పెట్రోల్, డీజిల్, ఆహారం, నిత్యావసరాలు అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జనం ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.
విదేశీ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. భారత దేశం మాత్రం కొంత మేర ఆయిల్ సాయం చేసింది. ఈ తరుణంలో దేశం సంక్షోభానికి ప్రధాన కారణం ప్రధానమంత్రిగా ఉన్న మహింద రాజపక్సేనంటూ(Mahinda Rajapaksa) ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన కనిపిస్తే చాలు దాడి చేసి చంపే పరిస్థితిలో ఉన్నారు. పాలకులు అవినీతి పరులైతే, అక్రమాలకు పాల్పడితే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోక తప్పదని తేల్చేశారు. దీంతో మాజీ ప్రధానిని దేశం విడిచి పారి పోకుండా ఉండేలా ప్రజలు కాపలా కాస్తున్నారు.
ఆర్థిక సంక్షోభానికి తానే కారణమంటూ తన పదవికి రాజీనామా చేసినా జనం ఒప్పు కోవడం లేదు. ఆయనకు శిక్ష పడాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.
రాజపక్స(Mahinda Rajapaksa) కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి కూడా నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మహింద కుటుంబం నావికా స్థావరంలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు.
TeluguISM – లంక ఎంపీ, మాజీ మంత్రి ఇళ్లకు నిప్పు