Al Jazeera Reporter : రిపోర్ట‌ర్ ను చంపేసిన ఇజ్రాయెల్ ద‌ళాలు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన అల్ జ‌జీరా

Al Jazeera Reporter : త‌మ సంస్థ‌లో జ‌ర్న‌లిస్ట్ గా ప‌ని చేస్తున్న షేరీన్ అఉ అక్లే ను ఇజ్రాయెల్ ద‌ళాలు పొట్ట‌న పెట్టుకున్నాయంటూ అల్ జ‌జీరా సంస్థ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా పాల‌స్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అర‌బిక్ చాన‌ల్ వార్తా సంస్థ‌లో ప్ర‌ముఖ వ్య‌క్తిగా ఉన్న అబు అక్లేహ్(Al Jazeera Reporter) మ‌ర‌ణాన్ని ధ్రువీక‌రించింది.

ఆమె వ‌య‌సు 51 ఏళ్లు. ఆమెను కావాల‌నే పొట్ట‌న పెట్టుకున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అల్ జ‌జీరా లో జ‌ర్న‌లిస్ట్ గా ఉన్న షిరీన్ అబు అక్లేహ్ పాల‌స్తీనా భూభాగంలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఇజ్రాయెల్ బ‌ల‌గాలు ఆమెను పొట్ట‌న పెట్టుకున్న‌ట్లు ఛానెల్ ఆరోపించింది.

అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, నిబంధ‌న‌లు ఉల్లంఘించాయ‌ని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్ర‌మ‌ణ ద‌ళాలు పాల‌స్తీనా లో అల్ జ‌జీరా క‌రెస్పాండెంట్ ను (Al Jazeera Reporter)హ‌త్య‌కు పాల్ప‌డ్డాయ‌ని మండిప‌డింది.

ఇజ్రాయెల్ ఆక్ర‌మ‌ణ ద‌ళాలు ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ దారుణానికి ఒడిగ‌ట్టాయంటూ పేర్కొంది. ఇందుకు ఇజ్రాయెల్ పూర్తిగా బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు ఇజ్రాయెల్ ను ప్రపంచ బోనులో దోషిగా నిల‌బెట్టాల‌ని ప్ర‌పంచ దేశాలు కోరాల‌ని అల్ జ‌జీరా ఛానల్ యాజ‌మాన్యం కోరింది.

ఉత్త‌ర వెస్ట్ బ్యాంక్ లోని పాల‌స్తీనా సాయుధ గ్రూపుల‌కు బ‌ల‌మైన కోట అయిన జెనిన్ శ‌ర‌ణార్తి శిబిరంలో ఇవాళ తెల్ల వారుజామున ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన‌ట్లు ఇజ్రాయెల్ ధ్రువీక‌రించింది.

అనుమానితులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. జ‌ర్న‌లిస్టులు గాయ‌ప‌డ్డారా లేక పాల‌స్తీనా తుపాకీ కాల్పుల వ‌ల్ల ఇది జ‌రిగిందా అన్న‌ది తేలాల్సి ఉందంటూ ఇజ్రాయెల్ పేర్కొంది.

Also Read : నేవీ స్థావ‌రంలో దాచుకున్న రాజ‌ప‌క్స‌

Leave A Reply

Your Email Id will not be published!