China Plane Aborts : చైనా ఫ్లైట్ జెట్ టేకాఫ్ లో మంట‌లు

ప్ర‌యాణికులు, సిబ్బంది సుర‌క్షితం

China Plane Aborts : చైనా ప్యాసింజర్ జెట్ టేకాఫ్ ను అర్దాంత‌రంగా నిలిపి వేసింది. ర‌న్ వే కు వెళుతుండ‌గా ప్లైట్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన ప్రయాణికులు సంఘ‌ట‌నా స్థ‌లం నుండి ప‌రుగులు తీశారు.

ప్ర‌మాదానికి గురైన జెట్ రెక్క‌పై మంట‌లు వ్యాపించిన‌ట్లు చైనా ప్ర‌భుత్వ మీడియా వెల్ల‌డించింది. ఈ మేర‌కు వాటికి సంబంధించిన చిత్రాలు షేర్ చేసింది. ఇందులో 40 మందికి స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఇక విష‌యానికి వ‌స్తే చైనా ఎయిర్ పోర్టులో(China Plane Aborts) టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గురువారం ర‌న్ వేపైకి దూసుకు వెళ్లింది. దీంతో మంట‌లు చెల‌రేగాయి. కాగా ప్ర‌యాణికుల‌తో పాటు సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్ లైన్స్ వెల్ల‌డించింది.

113 మంది ప్ర‌యాణికులు, 9 మంది సిబ్బందితో కూడిన విమానం చాంగ్ కింగ్ నుండి టిబెట్ లోని నైన్సికి వెళుతుండ‌గా కొన్ని ప‌రిస్థితులు అనుకూలించ‌క పోవ‌డంతో టేకాఫ్ నిలిపి వేశారు.

దీని వ‌ల్ల జెట్ ర‌న్ వేను అధిగ‌మించింద‌ని తెలిపింది. టేకాఫ్ స‌మ‌యంలో ఫ్లైట్ టీవీ9833 ర‌న్ వే నుండి వైదొలిగింది. విమానం రెక్క‌ల‌కు మంట‌లు వ్యాపించాయని చాంగ్ కింగ్ జియాంగ్ బీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ తెలిపింది.

గాయాల‌కు గురైన వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించింది. య‌ధావిధిగా కార్య‌క‌లాపాలు సాధార‌ణ స్థితికి చేరుకున్నాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు పేర్కొంది.

గ‌త మార్చి నెల‌లో కున్మింగ్ నుండి గ్వాంగ్ జోకు ప్ర‌యాణిస్తున్న చైనా ఈస్ట‌ర్న్ విమానం(China Plane Aborts) 29 వేల అడుగుల ఎత్తు నుండి ప‌ర్వ‌త ప్రాంతంలోకి ప‌డి పోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న 132 మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

Also Read : రిపోర్ట‌ర్ ను చంపేసిన ఇజ్రాయెల్ ద‌ళాలు

Leave A Reply

Your Email Id will not be published!