Mukul Goyal : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ పోలీస్ బాస్ గా ఉన్న ముకుల్ గోయెల్(Mukul Goyal )ను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఆదేశాలను పాటించక పోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం , తదితర కారణాల రీత్యా అతడిని తప్పించినట్లు సర్కార్ వెల్లడించింది.
ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరించింది కూడా. ముకుల్ గోయెల్(Mukul Goyal )ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో కొనసాగుతున్నారు. ముకుల్ గోయెల్ గత ఏడాది జూలై 2021న ఉత్తర ప్రదేశ్ టాప్ పోస్టులో కొలువు తీరారు. పని పట్ల ఆసక్తి చూపడం లేదు.
దీంతో పాటు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆయన పని తీరుపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గత కొంత కాలం నుంచీ జోరుగా ప్రచారం జరుగుతోంది.
విచిత్రం ఏమిటంటే గత నెలలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎంతో జరిగిన అత్యవసర సమావేశానికి ముకుల్ గోయెల్ డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఎందుకు హాజరు కాలేదనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.
తన ఇష్టానుసారంగా వ్యవహరించడంపై సీఎం కన్నెర్ర చేశారు. ఇదిలా ఉండగా ముకుల్ గోయెల్ 1987 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తాను నేరాలపై ఫోకస్ పెట్టానని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెరుగు పడేలా చేశానని చెప్పారు ముకల్ గోయెల్.
కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్దంగా చెబుతోంది. ఇక ముకుల్ గోయెల్ అల్మోరా, జలౌన్ , మైన్ పురి, హత్రాస్ , అజంగఢ్, గోరఖ్ పూర్ , వారణాసి, నహరాన్ పూర్ , మీరట్ జిల్లాల్లో ఎస్పీగా , ఎస్ఎస్పీగా పని చేశారు.
Also Read : 2373 మందికి అపాయింట్మెంట్ లెటర్స్