Ehsan Mani : బీసీసీఐపై బీజేపీదే పెత్తనం
పీసీబీ మాజీ చైర్మన్ ఎహసాన్ మణి
Ehsan Mani : ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఎహసాన్ మణి(Ehsan Mani) . ఆయన ఏకంగా బీసీసీఐపై నిప్పులు చెరిగారు.
బీసీసీఐని క్రికెట్ క్రీడాకారులు నడపడం లేదని భారతీయ జనతా పార్టీ నడుపుతోందంటూ మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య దూరం పెరిగిందని, ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మ్యాచ్ లు జరగాలంటే ముందుగా మోదీ ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
బీసీసీఐ ఇప్పుడు ఎవరి చేతుల్లో నడుస్తుందో భారత్ లో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తారంటూ ఎద్దేవా చేశారు. బీసీసీఐ ప్రస్తుతం పూర్తిగా కాషాయ పార్టీ ఆధ్వర్యంలో కూరుకు పోయిందన్నారు.
బీసీసీఐకి మాజీ భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ చైర్మన్ , సిఇఓ అయినా మొత్తం పవర్ అంతా, నడిపిస్తున్నదంతా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షానే కదా అని ప్రశ్నించారు.
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. జే షా ఇప్పుడు కార్యదర్శి పదవి లో ఉన్నారు. ఒకరిద్దరు మంత్రుల సోదరులు కూడా అక్కడ తిష్ట వేశారు. బీసీసీఐ మా గురించి వెలెత్తి చూపించే ఆస్కారం లేదన్నారు.
ఏ క్రీడా సంస్థ అయినా బాగుండాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తాము పనిగట్టుకుని భారత్ ను ఆడాలంటూ కోరబోమంటూ పేర్కొన్నారు.
ఒకేవళ ఆడాలని అనుకుంటే మీరే రావాలంటూ ఎహసాన్ మణి(Ehsan Mani)కుండబద్దలు కొట్టారు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు జరగాలన్నా, సత్ సంబంధాలు కంటిన్యూ కావాలంటే భారత్ ముందుగా చొరవ తీసుకోవాలని సూచించారు.
Also Read : సెలెక్టర్ అయితే కార్తీక్ ను ఎంపిక చేస్తా