Divya Spandana DK : డీకే నిర్వాకం దివ్య స్పంద‌న ఆగ్ర‌హం

పారి పోలేదు రాజీనామా చేశానంతే

Divya Spandana DK : దివ్య స్పంద‌న ఈ పేరు క‌న్నడ నాట తెలియ‌ని వారంటూ ఉండ‌రు. ఎందుకంటే మోస్ట్ పాపుల‌ర్ న‌టిగా కంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో కీల‌క నాయ‌కురాలిగా ఎదిగారు. అనుకోకుండా ఎంత‌గా ఆద‌ర‌ణ పొందారో అంత‌లోనే ఆమె క‌నుమ‌రుగై పోయారు.

ఈ త‌రుణంలో త‌న‌ను కావాల‌నే ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారని, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ను దిగ‌జార్చే, ప‌రువుకు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ మేర‌కు ట్వీట్ తో నిప్పులు చెరిగారు ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ పై. ఆయ‌న వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తాను వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యానే పార్టీ నుంచు త‌ప్పుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు దివ్య స్పంద‌న(Divya Spandana DK) అలియాస్ ర‌మ్య‌. త‌న‌ను ప్ర‌త్యేకించి టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయ‌మంటూ కాంగ్రెస్ శ్రేణుల‌కు డీకే దిశా నిర్దేశం చేశారంటూ ఆరోపించారు.

క‌న్న‌డ నాట తానేమిటో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేకించి క‌న్న‌డ వార్తా ఛాన‌ళ్ల‌లో తాను రూ. 8 కోట్ల‌తో మోసం చేసి పారి పోయిందంటూ ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యేలా చేశారంటూ వాపోయింది.

త‌న‌కు అన్ని కోట్లు ఎవ‌రు ఇస్తార‌ని ఆమె ప్ర‌శ్నించింది. ఇదంతా క‌ట్టు క‌థ త‌ప్ప వాస్త‌వం లేద‌ని పేర్కొంది దివ్య స్పంద‌న‌. ప్ర‌స్తుతం తాను మౌనంగా ఉండ‌ట‌మే త‌ప్పైందంటూ మండి ప‌డింది.

మొత్తం జ‌రుగుతున్న తతంగంపై విచార‌ణ జ‌రిపించాలంటూ ఆమె ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ కు విన్న‌వించారు. ప్ర‌స్తుతం డీకే, ర‌మ్య(Divya Spandana DK) వివాదం హాట్ టాపిక్ గా మారింది.

 

Also Read : జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వేను ఆప‌లేం

Leave A Reply

Your Email Id will not be published!