Minister Ponmudi : అమిత్ షాకు పొన్ముడి స్ట్రాంగ్ కౌంటర్
హిందీ మాట్లాడే వాళ్లు పానిపూరి అమ్ముకుంటున్నారు
Minister Ponmudi : ఒకే దేశం ఒకే భాష ఒకే పౌరసత్వం నినాదాన్ని జపిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. దేశ వ్యాప్తంగా హిందీ మాట్లాడాలని, అవసరమైతే తప్ప ఇంగ్లీష్ లో సంభాషించాలంటూ బాంబు పేల్చారు కేంద్ర హోం శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా.
దేశమంతటా షా చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. హిందీ భాష కంటే తమిళ భాష అత్యంత ప్రాచీనమైనదంటూ తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ప్రసిద్ద సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ ఏకంగా తమిళం మూలం అదే మాకు ప్రియం అంటూ జాతీయ కవి ఫంక్తుల్ని ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.
ఇటీవల చేసిన ట్వీట్ కలకలం రేపింది. ఇదే సమయంలో హిందీ భాష పేరుతో తమపై రుద్దితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణాటక మాజీ సీఎంలు సిద్ద రామయ్య, హెచ్ డి కుమార స్వామి హెచ్చరించారు.
అమిత్ షాపై నిప్పులు చెరిగారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన విద్యా శాఖ మంత్రి పొన్ముడి(Minister Ponmudi) సంచలన కామెంట్స్ చేశారు.
కోయంబత్తూర్ లోని భారతీయార్ యూనివర్శిటీలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
హిందీ భాష నేర్చుకుంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నది నిజమే అయితే మరి దేశ వ్యాప్తంగా హిందీ మాట్లాడుతున్న వాళ్లంతా ఎందుకు పానిపూరీలు అమ్ముకుంటున్నారంటూ ప్రశ్నించారు.
ప్రస్తుం పొన్నుడి(Minister Ponmudi) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : మోదీ ప్రభుత్వం దేశానికి ప్రమాదం