P Chidambaram : భారత ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
నవ సంకల్ప్ చింతన్ శివిర్ లో కామెంట్
P Chidambaram : కాంగ్రెస్ అగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నాడు.
మోదీ ప్రభుత్వానికి ఒక పద్ధతి అంటూ లేకుండా పోయిందన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ్ సంకల్ప్ చింతన్ శివిర్ లో భాగంగా రెండో రోజు పి. చిదంబరం ప్రసంగించారు.
ఆయనను సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆర్థిక ప్యానెల్ కు చీఫ్ గా నియమించింది. ఈ సందర్భంగా చిదంబరం(P Chidambaram) మాట్లాడుతూ రోజు రోజుకు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు.
ఇలాగే వ్యవహరిస్తూ పోతే ఏదో ఒక రోజు శ్రీలంకలో ఎదురైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు చిదంబరం. బాహ్య పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచాయన్నారు.
నిన్నటి దాకా మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కరోనాను సాకుగా చూపించారని మండిపడ్డారు. తాజాగా దేశంలో కుల, మతం పేరుతో అడ్డంపెట్టుకుని పాలన సాగించే స్థితికి చేరుకోవడం దారుణమన్నారు చిదంబరం(P Chidambaram).
కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందని చెప్పారు. 2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ చట్టాలను పేలవంగా రూపొందించారని ఆరోపించారు.
అన్యాయంగా అమలు చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ కనిపిస్తోందన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా దారుణంగా మారిందన్నారు.
Also Read : కాంగ్రెస్ కు సునీల్ జాఖర్ రాజీనామా