Sheikh Mohamed Bin : యూఏఇ చీఫ్ గా షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్

అబుదాబి రాజుగా కూడా ఆయ‌నే

Sheikh Mohamed Bin : సుదీర్గ కాలం పాలం యూఏఇకి చీఫ్ గా, అబుదాబికి రాజుగా సేవ‌లందించిన షేక్ ఖ‌లీఫా మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ త‌రుణంలో షేక్ ఖ‌లీఫా స్థానంలో షేక మొహమ్మ‌ద్ బిన్ జాయెద్ నియ‌మితుల‌య్యారు.

శ‌నివారం అధికారికంగా వెల్ల‌డించింది ప్ర‌భుత్వం. ఇదిలా ఉండ‌గా షేక్ ఖ‌లీఫా మృతికి సంతాప సూచ‌కంగా అర‌బ్ ప్ర‌భుత్వం 40 రోజుల పాటు సంతాప దినాలు ప్ర‌క‌టించింది.

ఈ రోజుల‌లో ప్ర‌భుత్వ ప‌రంగా సంస్థ‌లు, కార్య‌క‌లాపాలు, ప‌నులు పూర్తిగా నిలిచి పోతాయి. జాతీయ ప‌తాకాన్ని స‌గం అవ‌న‌తం చేస్తారు. ఇదే స‌మ‌యంలో అర‌బ్ కంట్రీతో పాటు అబుదాబికి కూడా షేక్ మొహమ్మ‌ద్ బిన్(Sheikh Mohamed Bin) జాయెద్ ప్రిన్స్ గా నియ‌మించింది అక్క‌డి ప్ర‌భుత్వం.

షేక్ ఖ‌లీఫా 18 ఏళ్ల పాటు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కు ప్రెసిడెంట్ గా , అబుదాబికి ప్రిన్స్ గా కొన‌సాగారు. ఆయ‌న పెను మార్పులు తీసుకు వ‌చ్చారు. ప్ర‌ధానంగా యుఏఇని అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉండేలా తీర్చిదిద్దారు.

అంతే కాదు భార‌త దేశంతో షేక్ ఖ‌లీఫా స‌త్ సంబంధాలు నెరిపారు. ఎక్కువ ప్ర‌యారిటీ ఇండియాకు ఇచ్చారు. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి త‌న సంతాప సందేశంలో భార‌త్ గొప్ప మిత్రుడిని కోల్పోయింద‌న్నారు.

ప్ర‌పంచంలో గొప్ప దార్శ‌నిక పాల‌కుడిగా పేరొందారంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఎన్నికైన షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్(Sheikh Mohamed Bin) జాయెద్ షేక్ ఖ‌లీఫాకు స్వ‌యాన సోద‌రుడు.

చాలా ఏళ్ల నుంచి తెర వెనుక ఉంటూ పాల‌నా వ్య‌వ‌హారాలు తానే చూస్తూ వ‌స్తున్నారు. ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త ఈయ‌న‌దే కావ‌డం విశేషం.

Also Read : ఉపేక్షించొద్దు మ‌హింద‌ను అరెస్ట్ చేయండి

Leave A Reply

Your Email Id will not be published!