DR Manik Saha : త్రిపుర సీఎంగా మాణిక్ సాహా

ఎంపిక చేసిన బీజేపీ హై క‌మాండ్

DR Manik Saha : త్రిపుర సీఎంగా డాక్ట‌ర్ మాణిక్ సాహాను(DR Manik Saha) భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం (హైక‌మాండ్ ) ఖ‌రారు చేసింది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే ఆయ‌న‌ను ఎంపిక చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. వృత్తి రీత్యా ఆయ‌న దంత వైద్యుడు.

గ‌త నెల‌లోనే రాజ్య‌స‌భ ఎంపీగా ఎన్నిక‌య‌యారు. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్నారు. ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న బిప్ల‌బ్ కుమార్ దేబ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన అనంత‌రం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. తాను గ‌వ‌ర్న‌ర్ ఎస్. ఎన్. ఆర్య‌కు స‌మ‌ర్పించిన‌ట్లు వెల్ల‌డించారు. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో భాగంగానే తాను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా బీజేపీలో చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే రాజీనామాకు దారి తీశాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుత సీఎం బిప్ల‌బ్ దేబ్ రాజీనామా చేసిన వెంట‌నే హై క‌మాండ్ డాక్ట‌ర్ పేరు ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బిప్ల‌బ్ కుమార్ దేబ్. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. పార్టీ అన్నిటికంటే అత్యున్న‌త‌మైంది.

నేను బీజేపీకి న‌మ్మ‌క‌మైన కార్య‌క‌ర్త‌ను నాకు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌కు న్యాయం చేశాన‌ని భావిస్తున్నా. అది బీజేపీ చీఫ్ అయినా లేదా త్రిపుర సీఎం అయినా. నేను స‌మ‌గ్ర అభివృద్ధికి కృషి చేశాన‌ని అన్నారు.

రాష్ట్రంలో బీజేపీ పునాదిని ప‌టిష్టం చేసేందుక‌కు వివిధ రంగాల‌లో అట్ట‌డుగు స్థాయిలో ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు దేవ్. మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో కీల‌కంగా మారాల‌న్నారు.

Also Read : బ‌ల‌హీన వ‌ర్గాల‌కు 50 శాతం కోటా

Leave A Reply

Your Email Id will not be published!