Gun Man Kills : దుండగుడి దుశ్చర్య 10 మంది కాల్చివేత
శ్వేత జాతీయుడి నిర్వాకం బైడెన్ దిగ్భ్రాంతికరం
Gun Man Kills : అమెరికాలోని న్యూయార్క్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్ లోకి సైనిక వేషధారణతో వచ్చిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు(Gun Man Kills). ఇక్కడ నల్ల జాతీయులే ఎక్కువగా ఉంటారు.
ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బఫెలో పోలీస్ కమిషనర్ జోసెఫ్ గ్రామగ్లియా వెల్లడించారు.
సూపర్ మార్కెట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. కాల్పుల్లో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. 18 ఏళ్ల శ్వేత జాతీయుడు జాతి ప్రేరేపిత దాడికి పాల్పడ్డాడు.
విచిత్రం ఏమిటంటే కెమెరాలో దానిని ప్రసారం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో(Gun Man Kills) ఎక్కువ మంది నల్ల జాతీయులేనని పోలీసులు వెల్లడించారు. ముష్కరుడు మొదట టాప్స్ సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలంలో నలుగురిని కాల్చి చంపాడు.
వారిలో ముగ్గురు మరణించారు. ఆపై లోపలికి వెళ్లి కాల్పులకు తెగ బడ్డాడు. సూపర్ మార్కెట్ లో మరణించిన వారిలో సాయుధ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారి కూడా ఉన్నారు.
ఇదే సమయంలో సెక్యూరిటీ గార్డు సాయుధుడైన దుండగుడిపై కాల్చినా సాయుధ కవచం ధరించడంతో సేఫ్ గా బయట పడ్డాడు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
దుశ్చర్యకు పాల్పడిన దుండగుడిని పట్టుకున్నారు. చివరకు లొంగి పోక తప్పలేదు. కాల్పులను ద్వేష పూరిత నేరంగా పరిశోధిస్తున్నట్లు స్టీఫెన్ బెలోంగియా వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్.
Also Read : దేశంలో దొంగలు పడ్డారు – ఇమ్రాన్ ఖాన్