Tajinder Bagga : కేజ్రీవాల్ ను ప్రశ్నించడం ఆపను
ఢిల్లీ బీజేపీ నాయకుడు తజీందర్ బగ్గా
Tajinder Bagga : ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుడు తజీందర్ పాల్ సింగ్ బగ్గా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు.
తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా లేదా వేధింపులకు గురి చేసినా తాను ప్రశ్నించడం మాత్రం ఆపనంటూ స్పష్టం చేశారు. గురు గ్రంథ్ సాహిబ్ దాడికి పాల్పడిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు బగ్గా.
ఎప్పుడు జైలులో పెడతారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అంబూ తజీందర్ బగ్గా నిలదీశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగాడు బగ్గా అరవింద్ కేజ్రీవాల్ పై.
అంతే కాకుండా అప్పటి పాలకవర్గం నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని మాజీ పంజాబ్ సీఎం , కాంగ్రెస్ నాయకుడు చరణ్ జిత్ సింగ్ చన్నీని అనరాని మాటలు అన్న కేజ్రీవాల్ వీడియోను కూడా పోస్ట్ చేశాడు తజీందర్ సింగ్ బగ్గా(Tajinder Bagga).
బర్గారీ కేసుపై పంజాబ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సూత్రధారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారందరికీ ఎరుకే. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.
కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ఒక నివేదికను తయారు చేశారు. చన్నీ సాహెబ్ దానిని చడవచ్చు. కేవలం 24 గంటల్లోనే కుట్రదారులపై చర్యలు తీసుకోగలమంటూ ఢిల్లీ సీఎం మీడియాతో అన్నారు.
దానిని ఈ సందర్భంగా బగ్గా(Tajinder Bagga) ప్రస్తావించారు. ఇదిలా ఉండగా పంజాబ్ పోలీస్ లో మాజీ ఇన్స్ పెక్టర్ జనరల్ అయిన కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ జూన్ 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
Also Read : త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం