Amazon Jobs : ఇండియాలో 11.6 లక్షల జాబ్స్ : అమెజాన్
స్పష్టం చేసిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ
Amazon Jobs : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ అమెరికన్ కంపెనీ అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు భారత దేశంలో తమ సంస్థ ద్వారా 11 లక్షల 60 వేల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది.
ఇందులో ప్రత్యక్ష, పరోక్ష జాబ్స్ ఉన్నాయని వెల్లడించింది. 2025 సంవత్సరం నాటికి తమ సంస్థ 20 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించే లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేసింది కంపెనీ.
$5 బిలియన్ల ఎగుమతులు ప్రారంభించామని, ఒక్క ఇండియాలోనే 40 లక్షల ఎంఎస్ఎంఇలను డిజిటలైజ్ చేయడం జరిగిందని పేర్కొంది అమెజాన్(Amazon Jobs).
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అమెజాన్(Amazon Jobs) ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ.
కాగా సృష్టించిన ఉద్యోగాలకు సంబంధించి ఐటీ, ఇ కామర్స్ , లాజిస్టిక్స్ , తయారీ, కంటెంట్ క్రియేషన్ , నైపుణ్య అభివృద్ధి తదితర రంగాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈనెల ప్రారంభంలో అమెజాన్ 2025 నాటికి భారత దేశం నుండి $20 బిలియన్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 2020లో $10 బిలియన్ల ఎగుమతులు చేయాలని టార్గెట్ పెట్టుకుందని , ఆ దిశగా అడుగులు వేశామని తెలిపారు మనీష్ తివారీ.
అదే ఏడాదిలో ఒక కోటి ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేస్తామని కంపెనీ ప్రతిజ్ఞ చేసిందన్నారు. ఈరోజు వరకు విక్రేతలు, కళాకారులు, నేత కార్మికులు, డెలివరీ, లాజిస్టిక్స్ , సేవా భాగస్వాములు మొదలైన వాటితో సహా 40 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు అధికారం ఇవ్వడం జరిగిందన్నారు.
టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి సారించిన స్టార్టప్ లు , వ్యవస్థాపకులలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ గత ఏడాది $250 మిలియన్ల అమెజాన్ వెంచర్ ఫండ్ ను ఏర్పాటు చేసింది.
Also Read : ట్విట్టర్ లో లైట్లు వెలగడం లేదు : సిఇఓ