CSK vs GT IPL 2022 : గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 134 రన్స్
రాణించిన రుతురాజ్ ..జగదీశన్
CSK vs GT IPL 2022 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022లో గుజరాత్ టైటాన్స్(CSK vs GT IPL 2022) తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ముంబై వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మరోసారి ఆ జట్టు బౌలర్లు కట్టడి చేశారు పరుగులు చేయనీయకుండా.
టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి తోడు రషీద్ ఖాన్ బంతిని తిప్పేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్(CSK vs GT IPL 2022) బ్యాటర్లు ధాటిగా రన్స్ చేయలేక చేతులెత్తేశారు.
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది సీఎస్కే. ఫుల్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ డేవాన్ కాన్వే 5 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి వచ్చిన మొయిన్ అలీ 21 రన్స్ చేసి నిరాశ పరిచాడు.
కష్టాల్లో ఉన్న చెన్నై తరపున రుతురాజ్ గైక్వాడ్ మరోసారి ఆదుకున్నాడు. గోడలా నిలిచాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 53 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.
అతడితో పాటు యువ స్టార్ ప్లేయర్ నారాయణ్ జగదీశన్ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను నిలబెడుతున్న సమయంలో వీరిద్దరి భాగస్వామ్యానికి తెర దించాడు ఆఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ . రుతురాజ్ ను పెవిలియన్ కు చేర్చాడు.
అనంతరం వచ్చిన స్టార్ హిట్టర్ శివమ్ దూబే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగితే ఫినిషర్ గా పేరొందిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. తీవ్ర నిరాశకు గురి చేశాడు.
Also Read : కుల్దీప్ సేన్ కు మైఖేల్ వాన్ కితాబు