Modi Congratulates : భార‌త్ కు స్వర్ణం దేశానికి గ‌ర్వ‌కార‌ణం

థామ‌స్ క‌ప్ గెలిచిన ఆట‌గాళ్ల‌కు మోదీ గ్రీటింగ్స్

Modi Congratulates : మెయిడెన్ థామ‌స్ క‌ప్ ను 73 ఏళ్ల త‌ర్వాత గెలుచుకున్న భార‌త జ‌ట్టుకు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(Modi Congratulates) ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు. అద్భుత‌మైన ఆట తీరుతో దేశ ప్ర‌జ‌ల మ‌నసు దోచుకున్నారు.

మీరు సాధించిన ఈ అపురూప‌మైన గెలుపు యావ‌త్ భార‌తావ‌నికే కాదు నేటి యువ‌త‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉంటుంద‌న్నారు. అకుంఠిత‌మైన ప‌ట్టుద‌ల‌, మొక్క‌వోని ఆత్మ విశ్వాసం చివ‌రి దాకా ప్ర‌ద‌ర్శించిన పోరాట ప‌టిమ ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంద‌న్నారు.

రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌ధాన మంత్రి(Modi Congratulates) భార‌త జ‌ట్టుకు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు.

భార‌త ప్ర‌భుత్వం మిమ్మ‌ల్ని చూసి గ‌ర్విస్తోంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండోనేషియా, చైనా, మ‌లేషియా, జ‌పాన్ ల‌తో క‌లిసి థామ‌స్ క‌ప్ ను గెలుచుకున్న ఆరో దేశంగా భార‌త్ ఆదివారం నాటి గెలుపుతో అవ‌త‌రించింది.

బ్యాంకాక్ లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో 14 సార్లు రికార్డ్ ఛాంపియ‌న్ గా చ‌రిత్ర సృష్టించిన ఇండోనేషియాను ఓడించింది భార‌త పురుషుల బ్యాడ్మింట‌న్ జ‌ట్టు. ఇవాళ చ‌రిత్ర పుస్త‌కాల్లో త‌మ పేర్ల‌ను పొందు ప‌రిచింది.

ఏకంగా 3-0 తేడాతో ఇండోనేషియాను ఓడించి చ‌రిత్ర సృష్టించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి భార‌త జ‌ట్టు కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ విజ‌యం రాబోయే క్రీడాకారుల‌ను ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

భార‌తీయులంతా మిమ్మ‌ల్ని చూసి ఆనందంతో ఉన్నార‌ని పేర్కొన్నారు ప్ర‌ధాని.

Also Read : భార‌త్ సంచ‌ల‌నం థామ‌స్ క‌ప్ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!